Zomato: క్విక్ ఫుడ్ డెలివరీ సేవల్లో జొమాటో రీ ఎంట్రీ..! 22 h ago

featured-image

ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్‌ జొమాటో తిరిగి క్విక్ డెలివరీ సేవలను మళ్లీ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ విభాగంలో పోటీ పెరుగుతున్న నేపథ్యంలో గతంలో పరిచయం చేసిన ఈ సర్వీసులను మళ్ళీ మొదలుపెట్టింది. ఇకపై జొమాటో 15 నిమిషాల్లో ఆహారం అందించేందుకు సిద్ధంగా ఉంది.

ఈ సర్వీసుల గురించి అధికారికంగా జొమాటో ప్రకటించకపోయినప్పటికీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని తెలుస్తుంది. జొమాటో యాప్‌ వినియోగిస్తున్నవారికి అప్లికేషన్ సెర్చ్ విభాగంలో "15 నిమిషాల డెలివరీ" అనే ప్రత్యేక ట్యాబ్ కనిపిస్తోంది, ఇందులో క్విక్‌గా తయారుచేసే రెసిపీస్, రెడీ-టు-ఈట్ వంటకాలను ఫీచర్ చేశారు. ఈ డెలివరీ సేవలు వేగవంతం కోసం రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న రెస్టారెంట్లకు సరిపోయేలా పరిమితం చేయబడ్డాయి.

ఇది గతంలో జొమాటో చేసిన 10 నిమిషాల డెలివరీ ప్రకటనకు సమానంగా, కానీ అప్పటి కొద్ది పరిణామాల వలన ఆ సేవలను నిలిపి వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం స్విగ్గీ, ఓలా వంటి ప్రత్యర్థులు కూడా 10 నిమిషాల డెలివరీ సేవలను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నందున, జొమాటో, తన సర్వీసులను మరింత వేగంగా అభివృద్ధి చేయడం, విస్తరించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, జొమాటో 15 నిమిషాల డెలివరీని సకాలంలో అమలు చేయడం ద్వారా మార్కెట్ పోటీలో నిలబడాలని చూస్తోంది.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD